పిఎంఇండియా
ఏకాగ్రతని, దృఢసంకల్పాన్ని బలపరుచుకోవడంలో అభ్యాసాన్ని క్రమం తప్పక కొనసాగించడానికి, అంకిత భావంతో ప్రయత్నిస్తుండడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని చెబుతున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘ఏకాగ్రతాథ్ సంకల్పః స్నాయువద్ వర్ధనక్షమౌ
నిత్యాభ్యాసప్రయోగాభ్యామధికాధికమృధ్యతః’’ అనే సంస్కృత సుభాషితాన్ని ప్రస్తావించారు.
ఈ సుభాషితం ఏకాగ్రత, సంకల్పం మన నాడీ వ్యవస్థ వంటివి. వీటిని నిరంతర అభ్యాసం, సరైన ప్రయత్నాలతో పటిష్ట పరుచుకోవచ్చు. క్రమంగా ఏకాగ్రత, సంకల్పం.. ఈ రెండూ కూడా దృఢతరంగానూ, ప్రభావవంతంగానూ మారుతాయి అని మనకు చెబుతోంది.
एकाग्रताथ सङ्कल्पः स्नायुवद् वर्द्धनक्षमौ।
— Narendra Modi (@narendramodi) July 21, 2026
नित्याभ्यासप्रयोगाभ्यामधिकाधिकमृध्यतः॥ pic.twitter.com/Y6ABikqNaI