Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఫిలిప్పీన్స్‌లో ప్రధానమంత్రి పర్యటన: పత్రాలు.. ప్రకటనలు


పత్రాలు:

·        విపత్తు నిర్వహణలో సహకారంపై ఆసియాన్-భారత్ సంయుక్త ప్రకటన

·        ఆన్‌లైన్ మోసాలు, సంబంధిత నేరాల నిరోధంపై సహకార బలోపేతం దిశగా  తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు నాయకుల ప్రకటన

·        ఉమ్మడి భవిష్యత్తుకు సంయుక్త సారథ్యం: స్థిరత్వం, పునరుద్ధరణపై తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు ప్రకటన

ప్రకటనలు:

   I.    భారత్‌-ఆసియాన్‌ 23వ శిఖరాగ్ర సదస్సు

1.    అనుసంధానం, శాస్త్రీయ పరిశోధన, విపత్తుల నిర్వహణ, తీర రక్షకదళ సహకారం, సముద్ర రంగ అవగాహన, నావికుల భద్రత పెంపుపై దీర్ఘకాలిక ఆసియాన్-భారత్ సముద్ర సహకార ప్రణాళిక;

2.   ఈ ప్రాంతంలో సామర్థ్య వికాసం కోసం సంయుక్త సైబర్ ఫోరెన్సిక్స్ శిక్షణ కార్యక్రమం;

3.   ఆసియాన్-భారత్ అణుశక్తి సాంకేతికత ఆదానప్రదానాలు;

4.   ఆసియాన్-భారత్ స్పేస్ హ్యాకథాన్;

5.   గనుల తవ్వకం, కీలక ఖనిజాలపై ఆసియాన్-భారత్ సహకారం;

6.   యువజన సదస్సు, యువ పార్లమెంటేరియన్ల రాకపోకలు, అంకుర హ్యాకథాన్‌ల ద్వారా ఆసియాన్-భారత్ యువజన సంధానం;

7.   భారత్‌లోని నలంద విశ్వవిద్యాలయంలో ఆసియాన్ దేశాలకు స్కాలర్‌షిప్‌ల  పెంపు;

8.   వేవ్స్-2027లో ఆసియాన్-భారత్‌ సృజన భాగస్వామ్య కేంద్రం;

9.   ఆసియాన్ దేశాల పర్యాటకులకు ఉచిత ఇ-వీసా.

  II.    తూర్సు ఆసియా సదస్సు

1.    ఉమ్మడి శిక్షణ-అత్యవసర ప్రతిస్పందనాత్మక సహకారంపై నావికా సిబ్బంది భద్రత కార్యక్రమం.

2.   ఆన్‌లైన్ మోసాలు, సైబర్-సరిహద్దు నేరాల నుంచి ఎదురయ్యే ఆధునిక ముప్పుల పరిష్కారంపై నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలో ‘ఈఏఎస్ సైబర్ క్రైమ్’ సదస్సు.

3.   లోథాల్‌లో ‘ఈఏఎస్ మారిటైమ్ హెరిటేజ్ ఫెస్టివల్’.

4.   ఈఏఎస్ దేశాలతో విద్యా సహకారం మరింత పెంచేందుకు నలందలో ఈఏఎస్ విశ్వవిద్యాలయ శిఖరాగ్ర సదస్సు.

***