Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా వీర సైనికులకు ప్రధానమంత్రి కృతజ్ఞతాభివందనాలు


  కార్గిల్ విజయ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీర సైనికులకు కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. దేశ భద్రత దిశగా కర్తవ్య నిర్వహణలో అసాధారణ ధైర్యసాహసాలు, అంకితభావం ప్రదర్శించిన వీరజవాన్లకు యావద్దేశం కృతజ్ఞతలు తెలుపుతున్నదని ఆయన పేర్కొన్నారు.

అత్యంత సంక్లిష్ట పరిస్థితుల నడుమ వారు ప్రదర్శించిన శౌర్యం జాతికి గర్వకారణంగా నిలుస్తుందన్నారు. వారి అంకిత భావం, శభక్తి, కర్తవ్య పరాయణత తరతరాలకూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“కార్గిల్ విజయ దినోత్సవం నేపథ్యంలో దేశ భద్రత పరిరక్షలనలో అసాధారణ ధైర్యసాహసాలు, అంకితభావం ప్రదర్శించిన వీర సైనికులకు యావద్దేశం కృతజ్ఞతలు తెలుపుతోంది. అత్యంత క్లిష్ట పరిస్థితులు, వాతావరణం మధ్య వారు ప్రదర్శించిన శౌర్యం జాతికి సదా గర్వకారణం. వారి అంకితభావం, దేశభక్తి, కర్తవ్య పరాయణత తరతరాలను ఉత్తేజితం చేస్తూనే ఉంటాయి.”

 

*****

MJPS/SS/PRK