పిఎంఇండియా
ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ శ్రీ హర్ష్ గోయెంకా రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు పంచుకున్నారు. విచ్ఛిన్న ప్రపంచంలో కూటములను నిర్మించడంలో, పోటీ శక్తులతో సంబంధాలను సమతుల్యం చేయడంలో, భారతదేశ వ్యూహాత్మక ఆసక్తులను ముందుకు తీసుకెళ్లడంలో ప్రధానమంత్రి అనుసరిస్తున్న విదేశాంగ విధానం ఎలా దృష్టి సారిస్తుందో ఈ వ్యాసంలో శ్రీ హర్ష్ గోయెంకా వివరించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం పోస్టు:
విచ్ఛిన్న ప్రపంచంలో కూటములను నిర్మించడం, పోటీ శక్తులతో సంబంధాలను సమతుల్యం చేయడం, అదే సమయంలో భారతదేశ వ్యూహాత్మక ఆసక్తులను ముందుకు తీసుకెళ్లడమే పీఎం నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానమని ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ శ్రీ హర్ష్ గోయెంకా పేర్కొన్నారు.
బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో న్యూఢిల్లీ ప్రకటనను ఆమోదించడమే భారత్ అనుసరిస్తున్న ఐక్య వేదిక నిర్మాణ విధానానికి నిదర్శనమని ఆయన తెలియజేశారు.”
***
Shri @hvgoenka, Chairman of RPG Enterprises, writes that PM @narendramodi's foreign policy approach is about building coalitions in a fractured world, balancing ties with competing powers while advancing India's strategic interests.
— PMO India (@PMOIndia) September 17, 2026
He highlights the New Delhi Declaration… pic.twitter.com/I18cczsr6x