పిఎంఇండియా
గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడలు–2026 మహిళల 70 కేజీల బాక్సింగ్ విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్న అరుంధతి చౌదరిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
అరుంధతి చౌదరి తన అద్భుతమైన విజయంతో చరిత్ర సృష్టించారని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఆమె అసమాన క్రీడా నైపుణ్యాన్ని, అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారని ప్రధానమంత్రి ప్రశంసించారు.
రాబోయే సంవత్సరాల్లో ఆమె మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించిన శ్రీ మోదీ… ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026 మహిళల 70 కేజీల బాక్సింగ్ ఈవెంట్‌లో అద్భుతమైన ఆటతీరుతో స్వర్ణం సాధించి అరుంధతి చౌదరి చరిత్ర సృష్టించారు! ఆమె తన అసమాన క్రీడా నైపుణ్యాన్ని, అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు. ఆమెకు అభినందనలు. రాబోయే సంవత్సరాల్లో ఆమె మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా.
Arundhati Choudhary scripts history with a brilliant Gold in the Women’s 70 kg Boxing event at the Glasgow Games! She displayed technical excellence and unwavering confidence. Congratulations to her. Wishing her many more successes in the years ahead.#CWG2026
— Narendra Modi (@narendramodi) August 1, 2026
************
MJPS/SS/ST