Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్‌ను అభినందించిన ప్రధానమంత్రి


ఆసియా క్రీడల్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల విభాగంలో కాంస్యం గెలుచుకున్న రుద్రాంక్ష్ బాలసాహెబ్ పాటిల్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. అతని ఏకాగ్రత, క్రమశిక్షణ ప్రశంసనీయమని శ్రీ మోదీ పేర్కొన్నారు.

‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

ఆసియా క్రీడల పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో కాంస్యం గెలుచుకున్న రుద్రాంక్ష్ బాలసాహెబ్ పాటిల్‌కు అభినందనలు! ఆయన ప్రదర్శించిన ఏకాగ్రత, క్రమశిక్షణ ప్రశంసనీయం. ఆయన భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు.