Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ధైర్యాన్నీ, నిరంతర శ్రమనీ విడిచిపెట్టకూడదు: ప్రధానమంత్రి


భాగ్యం ప్రతికూలంగా మారినప్పటికీ ధైర్యాన్ని వదిలిపెట్టకూడదనీధైర్యంగా ఉంటూపట్టుదలను కలిగి ఉన్న వ్యక్తి తాను చేజార్చుకున్న దానిని తిరిగి పొందగలుగుతాడనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారునిపుణుడైన నావికుడు సముద్ర మధ్యంలో నౌక విరిగి ముక్కలైనా సరే ఆశ వదులుకోకుండా ఈదుకుంటూ జీవించి ఉండేందుకు ప్రయత్నిస్తాడనీఅలాగే దృఢసంకల్పాన్ని కలిగి ఉండి నిలకడగా ప్రయత్నిస్తూ ప్రతికూల పరిస్థితులను కూడా అధిగమించవచ్చనీ ఆయన వివరించారు.

‘‘త్యాజ్యం న ధైర్యం విధురేపి దైవే ధైర్యాత్కదాచిత్ స్థితిమాప్నుయాత్సః

యాతే సముద్రేపి చ పోతభంగే సాంయాత్రికో వాన్ఛతి కర్మ ఏవ’’ అన్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధాన మంత్రి పంచుకున్నారు.

అదృష్టం కలిసిరాకపోయినా కూడా ధైర్యాన్ని కోల్పోకూడదుఎందుకంటేధైర్యం వల్ల కోల్పోయిన అనుకూల స్థితిని మళ్లీ పొందవచ్చుసముద్ర మధ్యంలో నౌక విరిగి పోయినాప్రవీణుడైన నావికుడు ధైర్యాన్ని వీడకుండా జీవించి ఉండటం కోసం ఈదుతూ ప్రాణాలు నిలుపుకొనే ప్రయత్నం చేస్తాడు.. సరిగ్గా అదే విధంగాపట్టుదలతో ప్రయత్నించాలని మనకు ఈ సుభాషితం చెబుతోంది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘‘త్యాజ్యం న ధైర్యం విధురేపి దైవే ధైర్యాత్కదాచిత్ స్థితిమాప్నుయాత్సః

యాతే సముద్రేపి చ పోతభంగే సాంయాత్రికో వాన్ఛతి కర్మ ఏవ’’ అని పేర్కొన్నారు.

 

***