Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వాలో ప్రమాదం.. ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి సంతాపం


మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వాలో జరిగిన ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

 

 

మృతుల కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

 

“మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వాలో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరం. తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

 

మృతుల కుటుంబ సభ్యులకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నాం. గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున అందజేస్తాం”