పిఎంఇండియా
‘నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఆ ప్రసంగ ముఖ్యాంశాల్ని ప్రజలతో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ కొన్ని సందేశాలను పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘కాశీ పవిత్ర భూమిలో జనించిన ఈ సంక్షేమ ప్రధాన ఆలోచన ఇప్పుడొక జాతీయ కార్యాచరణగా మారింది. ‘నషా ముక్త్ యువా–వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ ప్రజలందరి బలంగా రూపొంది యువత మనసును ఆకట్టుకుంటుందని నేను నమ్ముతున్నాను’’.
‘‘మాదక పదార్థాలు కాసేపు ‘కిక్’ ఇస్తాయి.. కానీ కెరియర్నీ, కుటుంబ జీవితాన్నీ అథఃపాతాళానికి దిగజారుస్తాయి. అందువల్ల నషా జోలికి పోకుండా మన యువత శక్తియుక్తుల్ని రక్షించాల్సిన అవసరం ఉంది’’.
‘‘మత్తు పదార్థాలకు స్వస్తి పలికే దిశగా దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలలు, విశ్వవిద్యాలయాలలోని మన ప్రొఫెసర్లకు నేను ప్రత్యేకంగా పిలుపునిస్తున్నాను..’’
काशी की पावन धरती से उठा कल्याणकारी विचार अब एक नेशनल प्रोजेक्ट बन गया है। मुझे पूरा विश्वास है कि 'नशा मुक्त युवा-विकसित भारत संकल्प अभियान' सामूहिकता की ताकत से हर युवा मन को छूने वाला है। pic.twitter.com/Z4CGfOPxHN
— Narendra Modi (@narendramodi) August 2, 2026
ड्रग्स कुछ समय के लिए ‘High’ देता है, लेकिन करियर और फैमिली लाइफ को ‘Low’ कर देता है। इसलिए नशा मुक्त रहकर हमारे युवाओं को अपने Potential को Protect करना है! pic.twitter.com/Pne82x4qyK
— Narendra Modi (@narendramodi) August 2, 2026
नशा मुक्ति की दिशा में देशभर के कॉलेजों और यूनिवर्सिटीज के हमारे प्रोफेसर्स से मेरा यह विशेष आह्वान... pic.twitter.com/uikh4d1qDq
— Narendra Modi (@narendramodi) August 2, 2026