పిఎంఇండియా
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ రోజు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు.
‘భారత్–ఇజ్రాయెల్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’లో సాధిస్తున్న నిరంతర పురోగతిని ఇరు దేశాల నేతలు సమీక్షించారు. రెండు దేశాల పరస్పర ప్రయోజనాల కోసం వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే విషయంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై ఇరు దేశాల నాయకులు అభిప్రాయాలను పంచుకున్నారు.
ఉభయ నేతలూ ఒకరికొకరు నిరంతరం అందుబాటులో ఉండేందుకు అంగీకరించారు.