పిఎంఇండియా
హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో సంభవించిన ఘోర ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు శ్రీ మోదీ తెలిపారు
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘హిమాచల్ ప్రదేశ్లోని చంబాలో జరిగిన ప్రమాదంలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరం. ఈ కష్ట సమయంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
The loss of lives due to a mishap in Chamba, Himachal Pradesh, is deeply saddening. My thoughts are with the families who have lost their loved ones. May those injured recover at the earliest: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 8, 2026