పిఎంఇండియా
తెలంగాణ.. సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం సంభవించి ప్రాణ నష్టానికి దారి తీసినట్లు తెలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
తెలంగాణ.. సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకొని బాధపడ్డాను. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ’’ అని పేర్కొన్నారు.
***
Distressed to learn about the mishap in Suryapet, Telangana. My thoughts are with those who have lost their loved ones. Praying for the speedy recovery of the injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 26, 2026
తెలంగాణలోని సూర్యాపేటలో దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదం గురించి తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. తమ ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను: ప్రధాన మంత్రి @narendramodi
— PMO India (@PMOIndia) August 26, 2026