Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నేపాల్ ప్రధానితో మాట్లాడిన ప్రధానమంత్రి వరదల్లో ప్రాణనష్టం పట్ల సంతాపం తెలిపిన ప్రధానమంత్రి


 

నేపాల్ ప్రధాని శ్రీ బాలేంద్ర షాతో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నేపాల్‌లో వరదల కారణంగా సంభవించిన ప్రాణనష్టం పట్ల తమ సంతాపాన్ని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో నేపాల్‌లోని తమ సోదరీసోదరులకు భారతీయులంతా అండగా నిలుస్తారని శ్రీ మోదీ పేర్కొన్నారు.

నేపాల్‌కు సాధ్యమైనంత మానవతా సహాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని, సహాయక చర్యల విషయంలో భారత బృందాలు నేపాల్ అధికారులతో సన్నిహిత సమన్వయం కొనసాగిస్తున్నాయని ఆయన పునరుద్ఘాటించారు.

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

నేపాల్‌లో వరదల కారణంగా సంభవించిన ప్రాణనష్టం పట్ల ప్రధాని బాలేంద్ర షాతో మాట్లాడి నా సంతాపం తెలియజేశాను. ఈ క్లిష్ట సమయంలో నేపాల్‌లోని మా సోదరీసోదరులకు భారతీయులంతా అండగా నిలుస్తారు.

నేపాల్‌కు సాధ్యమైన మేరకు అన్ని విధాలా మానవతా సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. మా బృందాలు రక్షణ, సహాయక చర్యల్లో నేపాల్ అధికారులతో సన్నిహిత సమన్వయంతో సేవలందిస్తున్నాయి.

@PM_nepal_ 

@ShahBalen