Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలసిన ఐదవ ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ –


ఆగా ఖాన్ అభివృద్ధి నెట్‌వర్క్‌ (ఏకేడీఎన్‌) చైర్మన్‌ ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్–5 ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

భారత్‌లో ఏకేడీఎన్‌ దీర్ఘకాలంగా అందిస్తున్న సేవలను ప్రధానమంత్రి ప్రశంసించారు. ముఖ్యంగా సుస్థిర పట్టణాభివృద్ధి, జల సంరక్షణ, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణ పారిశుద్ధ్యం, యువత నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత రంగాల్లో సంస్థ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.

దేశవ్యాప్తంగా చారిత్రక ప్రదేశాల పునరుద్ధరణ, పునరుజ్జీవన కార్యక్రమాల ద్వారా భారత సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో ఏకేడీఎన్‌ చేస్తున్న మార్గదర్శక కృషిని కూడా ప్రధానమంత్రి ప్రశంసించారు.

భారత్‌ సమ్మిళిత అభివృద్ధి, సామాజిక పురోగతికి ఏకేడీఎన్‌ నిబద్ధతను ఆగా ఖాన్‌ పునరుద్ఘాటించారు. భారతదేశంలో మార్పును తీసుకువస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. మానవ సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో నూతన ఆవిష్కరణల పాత్రపై తన అభిప్రాయాలను ఆయన పంచుకున్నారు. 

 

***