Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పారిస్‌ అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగం

పారిస్‌ అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగం


మిత్రుడుఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కూప్రముఖులకూకార్యక్రమ భాగస్వాములందరికీ.. నమస్కారం!

ఈ మొదటి అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో భాగస్వామిని కావడం నాకెంతో సంతోషంగా ఉందినన్ను ఎంతో గౌరవంతో ఆహ్వానిస్తూ సమయోచితమైన ఈ విశేష కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అధ్యక్షుడు మాక్రాన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలుశతాబ్దాలుగా మన ఆలోచనలకూఊహలకూ అంతరిక్షం ఊపిరిపోసిందినేడు వాతావరణ మార్పుల నుంచి పంటల దిగుబడి వరకూసముద్రాల స్థితిగతుల నుంచి సమాజ సంక్షేమం వరకూ… భూమిపై మన మనుగడనూ అంతరిక్ష రంగం నిర్దేశిస్తోందిఅంతరిక్షం అందించే అవకాశాలు అనంతంఅయితేదానిపై మనకు సమష్టి బాధ్యత ఉందిఅంతరిక్షంలో కక్ష్యలు నానాటికీ కిక్కిరిసిపోతున్నసాంకేతికతలు అత్యంత శక్తిమంతంగా మారుతున్నఅంతరిక్ష భాగస్వాముల సంఖ్య పెరుగుతున్న ఈ రోజుల్లో… మన నిర్ణయాలు చాలా స్పష్టంగా ఉండాలిఘర్షణలకు కన్నా సహకారానికీతక్షణ ప్రయోజనాల కన్నా సుస్థిరతకూఎవరినీ విస్మరణకు గురిచేయకుండా.. సమ్మిళితత్వానికీ మనం ప్రాధాన్యమివ్వాలి.

మిత్రులారా,

వసుధైక కుటుంబం’ (ఒకే భూమిఒకే కుటుంబంఒకే భవితఅన్న విశాల భావనే భారత్ విధానానికి ప్రాతిపదికఈ స్ఫూర్తి ఇప్పుడు భౌగోళిక హద్దులను దాటి అంతరిక్షానికీ విస్తరించాలిఅంతర్జాతీయ చట్టాలుచర్చలుబహుపాక్షిక సహకారం ప్రాతిపదికగా.. సురక్షితభద్రమైనశాంతియుతసుస్థిర అంతరిక్ష రంగాన్ని సాకారం చేసుకునేందుకు మేం సంపూర్ణంగా మద్దతిస్తున్నాంపారదర్శకతసమగ్రతతో… సర్వజన హితానికీప్రజా సంక్షేమానికీ శాస్త్రీయ సమాచారం ఉపయోగపడాలి.

ఈ ఉదార తాత్వికతనే భారత అంతరిక్ష ప్రయాణం ప్రతిబింబిస్తోందిఈ ప్రస్థానానికి మూలస్తంభంగా నిలిచిన ఇస్రో.. అసాధారణ నైపుణ్యంతోతక్కువ వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టులతో ప్రపంచవ్యాప్త ప్రశంసలను అందుకుందిఇస్రో సాంకేతిక సామర్థ్యాలు రైతులకుమత్స్యకారులకు ఎంతో మేలు చేయడంతోపాటు.. వాతావరణ అంచనాలువిపత్తు నిర్వహణనావిగేషన్ సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయిఇప్పటివరకు 34 విభిన్న దేశాలకు చెందిన 430కి పైగా ఉపగ్రహాలను భారతీయ రాకెట్లు అంతరిక్షంలోకి పంపించాయిఇస్రో అందించే సాంకేతికతలుభాగస్వామ్యాలు భారత్‌కు మాత్రమే కాదు.. యావత్ ప్రపంచానికీ సేవలందిస్తున్నాయి.

ఈ అంతర్జాతీయ విశ్వాసం వెనుక.. తరతరాల భారతీయ శాస్త్రవేత్తలుఇంజినీర్లుసాంకేతిక నిపుణుల అంకితభావంనిరంతర శ్రమ దాగి ఉన్నాయిఅహర్నిశలూ శ్రమిస్తూ.. ఒక్కో మిషన్ ద్వారా ఒక్కో విజయంతో ఇస్రోకి వారు ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టారుఅంతరిక్ష పరిశోధన రంగంలో భారత్‌కు విశిష్టమైనప్రతిష్ఠాత్మకమైన స్థానాన్ని కల్పించారు.

చంద్రయాన్-3 ప్రయోగం ద్వారా చంద్రుని దక్షిణ ధృవం సమీపంలో అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందిఆదిత్య– ఎల్‌సూర్యుడి రహస్యాలను ఛేదిస్తోందిగతేడాది ఒక భారతీయ వ్యోమగామి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారుభవిష్యత్తుపై దృష్టి సారిస్తూ.. 2035 నాటికి ‘భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని’ ఏర్పాటు చేయాలనీ, 2040 నాటికి చంద్రుడిపైకి భారతీయుడిని పంపాలనీ లక్ష్యాలుగా నిర్దేశించుకున్నాంఈ దిశగా చేపట్టే చర్యలన్నింటిలోనూ మా మార్గదర్శక సూత్రం సుస్పష్టంగా ఉంది – వీటి ప్రయోజనాలు సమస్త మానవాళికీ అందాలి.

ఇస్రోతోపాటు భారత ప్రైవేటు అంతరిక్ష రంగం కూడా శరవేగంగా దూసుకెళ్తోందిఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఉత్సాహం.. ఇస్రో అత్యుత్తమ నైపుణ్యంతో జతకడుతోంది. 1960లలో తుంబా వేదికగా భారత అంతరిక్ష కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఫ్రాన్స్ మాకు అత్యంత విశ్వసనీయ భాగస్వామిగా నిలిచిందినేడు భూ పరిశీలన నుంచి అధునాతన సాంకేతికతల వరకు.. మన సహకారం విస్తరించిందిమానవాళి ప్రయోజనాలనూశాస్త్రీయ నైపుణ్యాన్నీ ఇది ఏకం చేస్తోందితదుపరి అంతరిక్ష ప్రస్థానంలో భారత్‌తో కలిసి నడవాల్సిందిగా ఫ్రాన్స్‌నూప్రపంచ దేశాలనూ మేం ఆహ్వానిస్తున్నాం.

మిత్రులారా,

‘‘సమస్త మానవాళి కోసంభవిష్యత్ తరాల కోసం… మనమంతా కలిసి పనిచేద్దాంసమష్టి ఆవిష్కరణలు చేద్దాంఅంతరిక్షాన్ని రక్షించుకుందాం’’ అన్న స్పష్టమైన సందేశాన్ని పారిస్‌ అంతరిక్ష సదస్సు ప్రపంచానికి అందించాలిసదస్సులో భాగస్వాములైన ప్రతిఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.

ధన్యవాదాలు

 

***