భారత ఉక్కు మనిషి, అఖండ భారత రూపశిల్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళులర్పించారు.
బలమైన, సంపన్నమైన, సమర్థవంతమైన భారతదేశ నిర్మాణానికి సర్దార్ పటేల్ తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన, స్వావలంబన భారత్ నిర్మాణం దిశగా సాగుతున్న ప్రయత్నాలకు ఆయన జీవితం గొప్ప స్ఫూర్తినిస్తూనే ఉంటుందని తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
“అఖండ భారతదేశ రూపశిల్పి, దేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నాను. బలమైన, సంపన్నమైన, సమర్థవంతమైన భారత్ నిర్మాణం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. మాతృభూమి సేవలో ఆయన చేసిన త్యాగం, చూపిన అంకితభావం అభివృద్ధి చెందిన, స్వావలంబన భారత్ నిర్మాణానికి గొప్ప స్ఫూర్తినిస్తున్నాయి’’.
अखंड भारत के प्रणेता देश के लौह पुरुष सरदार वल्लभभाई पटेल को उनकी जयंती पर सादर नमन। उन्होंने एक सशक्त, समृद्ध और समर्थ भारत के निर्माण के लिए अपना जीवन समर्पित कर दिया। मां भारती की सेवा में उनका त्याग और समर्पण विकसित एवं आत्मनिर्भर भारत के निर्माण के लिए बहुत बड़ा प्रेरणास्रोत है।
— Narendra Modi (@narendramodi) October 31, 2026