ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్18 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
భారతదేశ స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ నావిక్ను మరింత బలోపేతం చేసే దిశగా ఈ మిషన్ కీలక ముందడుగని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మెరుగైన సామర్థ్యాలతో ఎన్వీఎస్-03… కీలక సాంకేతిక పరిజ్ఞానంలో స్వావలంబన దిశగా భారతదేశ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లటంతో పాటు, పౌరులకు ప్రయోజనం చేకూర్చే నావిగేషన్ సేవలకు మద్దతిస్తుందని అన్నారు.
భారత అంతరిక్ష శాస్త్రవేత్తల అంకితభావం, మేధస్సును శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. వారి నిరంతర విజయాలు దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నాయని కొనియాడారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:
ఎన్వీఎస్-03ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్18 విజయవంతమైన ప్రయోగం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అభినందనలు.
స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ నావిక్ను బలోపేతం చేయటంలో ఈ మిషన్ కీలక ముందడుగు. మెరుగైన సామర్థ్యాలు గల ఎన్వీఎస్-03.. కీలక సాంకేతికతల్లో స్వావలంబన సాధించాలన్న మన లక్ష్యానికి సహకరించటమే కాక, ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నావిగేషన్ సేవలకు మద్దతిస్తుంది.
మన అంతరిక్ష శాస్త్రవేత్తల అంకితభావం, సృజనాత్మకత నిరంతరం దేశాన్ని గర్వపడేలా చేస్తున్నాయి.
@isro
Congratulations to our scientists and engineers at ISRO on the successful launch of GSLV-F18 carrying NVS-03. This mission marks an important step in strengthening NavIC, our indigenous satellite navigation system. Equipped with enhanced capabilities, NVS-03 will further our pursuit of self-reliance in critical technologies and support navigation services that benefit our people. The dedication and ingenuity of our space scientists continue to make our nation proud. @isro
— Narendra Modi (@narendramodi) October 31, 2026