పిఎంఇండియా
ఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆఫ్రికా సమాఖ్య చైర్పర్సన్, బురుండి దేశాధ్యక్షుడు ఎవరిస్టే ఎన్దాషిమియేతో ఈ రోజు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.
భారతదేశ అధ్యక్ష పదవీ కాలంలో 2023లో ఆఫ్రికా సమాఖ్య(ఏయూ) జీ20లో చేరే విషయంలో భారత్ పోషించిన పాత్రను ఇద్దరు నేతలు గుర్తు చేశారు. గ్లోబల్ సౌత్ పరిధిలో భారత్–ఆఫ్రికా సమాఖ్య భాగస్వామ్యం సహకారానికి ఒక ప్రధాన ఆధారమని వారు చెప్పారు. పరస్పరం అనుకూలమైన తేదీలో 4వ భారత్–ఆఫ్రికా ఫోరమ్ సదస్సును (ఐఏఎఫ్ఎస్-IV) త్వరలో నిర్వహించడం గురించి వారు చర్చించారు.
ఎబోలా వ్యాప్తిని విజయవంతంగా ఎదుర్కొనే విషయంలో ఏయూ నాయకత్వాన్ని ప్రధానమంత్రి అభినందించారు. ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టటంలో ఆఫ్రికా సీడీసీకి భారత్ అందించిన వైద్యపరమైన మద్దతును ఏయూ చైర్పర్సన్ ప్రశంసించారు.
సహృద్భావ వాతావరణం, ఐక్యత, ఉమ్మడి అభివృద్ధి ఆకాంక్షలతో ముడిపడి ఉన్న భారత్– బురుండి సంబంధాలను ఇద్దరు నేతలు చర్చించారు. ఆర్థిక సహకారం, అభివృద్ధి భాగస్వామ్యం, వ్యవసాయ ఆధునికీకరణ, ఆరోగ్య సంరక్షణ, సామర్థ్య పెంపు కార్యక్రమాల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను వారు సమీక్షించారు.
***
PM @narendramodi met President @GeneralNeva of Burundi on the sidelines of the BRICS Summit. The two leaders explored new avenues to expand the India-Burundi partnership, including agriculture, clean energy, youth skilling, development cooperation and capacity building. pic.twitter.com/I91Cxdlz9i
— PMO India (@PMOIndia) September 13, 2026
Delighted to meet President Évariste Ndayishimiye of Burundi on the sidelines of the BRICS Summit.
— Narendra Modi (@narendramodi) September 13, 2026
Congratulated Burundi on assuming the Chair of the African Union.
We discussed strengthening India-Burundi ties in development cooperation, capacity building, youth skilling,… pic.twitter.com/YcyKFWkVq4