పిఎంఇండియా
న్యూఢిల్లీలో బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు గౌరవనీయ ఫెర్డినాండ్ ఆర్.మార్కోస్ జూనియర్‌తో సమావేశమయ్యారు. ‘ఆసియాన్’ కూటమి అధ్యక్ష హోదాలో ఫిలిప్పీన్స్ ప్రస్తుత బ్రిక్స్ సదస్సులో పాల్గొనడంపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
భారత్–ఫిలిప్పీన్స్ మధ్య అన్ని రంగాలలో ద్వైపాక్షిక సహకార విస్తృతిపై వారిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, అంతరిక్షం, రైల్వే మౌలిక సదుపాయాలు, ఫిన్‌టెక్, విద్య, పర్యాటకం, శాస్త్ర–సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, ప్రజల మధ్య సంబంధాలు తదితర రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అధ్యక్షుడు మార్కోస్ 2025 ఆగస్టులో భారత్ సందర్శించినపుడు రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఒప్పందం కుదిరింది. దీని ప్రాతిపదికన ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తృతం చేసుకోవాలని నాయకులిద్దరూ నిశ్చయించారు. ఈ నేపథ్యంలో విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమిలో సభ్యత్వ స్వీకరణపై ఫిలిప్పీన్స్ నిర్ణయాన్ని ప్రధానమంత్రి స్వాగతించారు.
ప్రస్తుత సమావేశంలో భాగంగా పరస్పర ఆసక్తి గల ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రెండు దేశాల మధ్య గల వ్యూహాత్మక భాగస్వామ్యంలోని రంగాలన్నిటా సహకార బలోపేతంపై నిబద్ధతను పునరుద్ఘాటించారు.
***
PM @narendramodi had a meeting with President @bongbongmarcos on the sidelines of the BRICS Summit. The two leaders reviewed the growing momentum in the India-Philippines Strategic Partnership and discussed cooperation in trade, technology, space, innovation, creative industries… pic.twitter.com/w3WwLf4h1V
— PMO India (@PMOIndia) September 13, 2026
Delighted to meet President Ferdinand Marcos Jr. on the sidelines of the BRICS Summit. Wished him a very happy birthday too.
— Narendra Modi (@narendramodi) September 13, 2026
We reviewed the growing momentum in the India-Philippines Strategic Partnership.
Key focus areas are:
Economic linkages.
Technology.
Trade.… pic.twitter.com/14Q2z7oHct