Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూఢిల్లీలో బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఉగాండా ఉపాధ్యక్షురాలితో ప్రధానమంత్రి భేటీ

న్యూఢిల్లీలో బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సులో భాగంగా  ఉగాండా ఉపాధ్యక్షురాలితో ప్రధానమంత్రి భేటీ


న్యూఢిల్లీలో బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఉగాండా ఉపాధ్యక్షురాలు గౌరవ జెసికా రోజ్ ఎపెల్ అలుపోతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారుఈ సమావేశం సుహృద్భావ వాతావరణంలో ఫలవంతంగా ముగిసింది.
భారత్ఉగాండాల ద్వైపాక్షిక సంబంధాలను నేతలిద్దరూ సమీక్షించారుకీలక రంగాల్లో సహకారాన్ని ఇప్పటి కన్న పెంపొందించుకోవాలనీదీనికి సాంకేతిక భాగస్వామ్యాలను ఏర్పరుచుకోవడంసామర్థ్యాలను పెంచుకోవడంజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడంపెట్టుబడికి మార్గాన్ని సుగమం చేయడంఉభయ దేశాల్లో ప్రయివేటు రంగం సహకారాన్ని పొందడం వంటి మార్గాలను అనుసరించాల్సిన అవసరం ఉందనీ గుర్తించారుభారత్ఉగాండాల అభివృద్ధి భాగస్వామ్యం ఇరు దేశాలకూ బలవర్ధకం అవుతుందని వారు వ్యాఖ్యానించారుపరివర్తన పథంలో ఉగాండా వేగంగా పురోగమించడానికి ప్రకటించిన ‘విజన్ 2040’కు సంబంధించిన కార్యాచరణలో భారత్ వెన్నంటి నిలుస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారురెండు దేశాల ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలు ఈ భాగస్వామ్యానికి బలమైన పునాదిని అందిస్తాయని నేతలు స్పష్టం చేశారు.
అభివృద్ధి చెందుతున్న దేశాల వాణిని ప్రస్ఫుటంగా వినిపిస్తూఆయా దేశాల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఇరు దేశాలూ మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని నేతలిద్దరూ పిలుపునిచ్చారుశిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నందుకు ఉపాధ్యక్షురాలు జెసికా రోజ్ ఎపెల్ అలుపోకు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు.

 

***