Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇంజినీర్ల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు


ఇంజినీర్ల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇంజినీర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మెరుగైన భవిష్యత్తుకు దోహదపడే నిర్మాణాలు, నూతన ఆవిష్కరణలు, పరిష్కారాలను అందించడంలో ఇంజినీర్లు చేస్తున్న విశేష కృషిని ఆయన ప్రశంసించారు.

అసాధారణమైన ఇంజినీరింగ్ నైపుణ్యం, దేశ నిర్మాణ దార్శనికతతో తరతరాల ఇంజినీర్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న సర్ ఎం. విశ్వేశ్వరయ్యకు ప్రధానమంత్రి నివాళులు అర్పించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:
మెరుగైన భవిష్యత్తు కోసం నిర్మాణాలు, నూతన ఆవిష్కరణలు, పరిష్కారాలు అందిస్తున్న ఇంజినీర్లందరికీ ఇంజినీర్ల దినోత్సవ శుభాకాంక్షలు.
తన ఇంజనీరింగ్ నైపుణ్యం, దేశ నిర్మాణ దార్శనికతతో స్ఫూర్తినందిస్తున్న సర్ ఎం. విశ్వేశ్వరయ్యకు నివాళులు.