Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశాన్ని స్థిరత్వానికి నిలయంగా, వృద్ధికి చోదక శక్తిగా అభివర్ణించే ఓ కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


ఇటీవల సంక్షోభ పరిస్థితులు నెలకొన్న సమయంలో భారత్‌ స్థిరత్వానికి ప్రతీకగా, ఆర్థిక వృద్ధికి చోదక శక్తిగా ఎలా నిలిచిందో వివరిస్తూ శ్రీ హరీశ్ సాల్వే రాసిన ఒక కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పంచుకున్నారు. 

దేశానికి ప్రధానమంత్రి అందిస్తున్న స్థిరమైన నాయకత్వం, నిరంతర రాజకీయ స్థిరత్వమే ఇందుకు ప్రధాన కారణమని కథనంలో శ్రీ హరీశ్ సాల్వే పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి స్పష్టమైన దిశానిర్దేశం ఉండటం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానం, దీర్ఘకాలిక దేశ నిర్మాణ ప్రక్రియ మరింత బలోపేతమయ్యాయని ఆయన తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.

‘‘అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న సమయంలోనూ భారత్‌ స్థిరత్వానికి ప్రతీకగా, ఆర్థిక వృద్ధికి చోదక శక్తిగా నిలిచిందని శ్రీ హరీశ్ సాల్వే తన కథనంలో పేర్కొన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందిస్తున్న స్థిరమైన నాయకత్వం, రాజకీయ స్థిరత్వమే ఇందుకు కారణమని ఆయన తెలిపారు. దేశానికి స్పష్టమైన దిశా నిర్దేశం ఉండటం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానం, దీర్ఘకాలిక దేశ నిర్మాణం మరింత బలోపేతమయ్యాయని పేర్కొన్నారు’’

 

***