పిఎంఇండియా
భారత్‌లోని కొత్త తరం తన కలలను సాకారం చేసుకొనేలా గత పన్నెండేళ్లలో అవకాశాలు, మార్గాలు ఎలా విస్తరించాయో తెలియజేస్తూ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
భారత్‌లో ప్రతిభకు ఎన్నడూ కొదవ లేదని, భారతీయులు పెద్ద కలలు కనడానికి, వాటిని సాకారం చేసుకొనే వీలును విస్తరిస్తున్న అవకాశాలు అందిస్తున్నాయని ఈ వ్యాసం తెలిపిందని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:
“భారత్‌లో ప్రతిభకు కొదవ లేదు. కానీ తరచూ ఆ కలలను నెరవేర్చుకోవడంలో కొరవడినవి అవకాశాలు, మార్గాలే.
గడచిన పన్నెండేళ్లు ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పును తీసుకువచ్చాయో, కొత్త తరం కలలు కనడం మాత్రమే కాకుండా వాటిని సాకారం చేసుకొనే వీలును ఎలా కల్పించాయో పీవీ సింధు తన కథనంలో వివరించారు.’’
***
India has never lacked talent. What was often missing were opportunities and pathways to realise big dreams.
— PMO India (@PMOIndia) September 17, 2026
In her insightful piece, @Pvsindhu1 reflects on how the last 12 years have changed this, enabling a new generation of Indians not just to dream big, but to turn those… https://t.co/Ipay9ijlfG