Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్వయంసమృద్ధి, సేవా భావం… ప్రాధాన్యాన్ని చెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి


స్వయంసమృద్ధి, పరులకు సేవ చేయడం.. వీటికి ఉన్న ప్రాధాన్యాన్ని వివరిస్తున్న‘‘స్వాధీనైవ సమృద్ధిర్జనోపజీవ్యత్వముచ్ఛ్రయశ్ఛాయా, సత్పుంసో మరుభూరివ జీవనమాత్రం సమాశాస్యమ్’’ అనే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.
స్వావలంబనలోనే వ్యక్తి అసలైన సమృద్ధి ఇమిడి ఉంటుందని, ఇతరులకు ఉపయోగపడడం ఆ వ్యక్తికి జీవన పరమార్థంగా మారుతుందనే సందేశాన్ని ఈ సుభాషితం మనకు బోధిస్తోంది. బాటసారులకు పండ్లతో పాటు నీడను అందించడమే పరమార్థంగా భావించి  వృక్షం ఎడారి వంటి అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ సజీవంగా ఉండాలని కోరుకొంటుంది. ఆ వృక్షం వంటి వారే  సజ్జనులూను అనే పోలికను ఈ శ్లోకం చెబుతోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ,
‘‘స్వాధీనైవ సమృద్ధిర్జనోపజీవ్యత్వముచ్ఛ్రయశ్ఛాయా
సత్పుంసో మరుభూరివ జీవనమాత్రం సమాశాస్యమ్’’ అని పేర్కొన్నారు.