పిఎంఇండియా
స్వయంసమృద్ధి, పరులకు సేవ చేయడం.. వీటికి ఉన్న ప్రాధాన్యాన్ని వివరిస్తున్న‘‘స్వాధీనైవ సమృద్ధిర్జనోపజీవ్యత్వముచ్ఛ్రయశ్ఛాయా, సత్పుంసో మరుభూరివ జీవనమాత్రం సమాశాస్యమ్’’ అనే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.
స్వావలంబనలోనే వ్యక్తి అసలైన సమృద్ధి ఇమిడి ఉంటుందని, ఇతరులకు ఉపయోగపడడం ఆ వ్యక్తికి జీవన పరమార్థంగా మారుతుందనే సందేశాన్ని ఈ సుభాషితం మనకు బోధిస్తోంది. బాటసారులకు పండ్లతో పాటు నీడను అందించడమే పరమార్థంగా భావించి వృక్షం ఎడారి వంటి అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ సజీవంగా ఉండాలని కోరుకొంటుంది. ఆ వృక్షం వంటి వారే సజ్జనులూను అనే పోలికను ఈ శ్లోకం చెబుతోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ,
‘‘స్వాధీనైవ సమృద్ధిర్జనోపజీవ్యత్వముచ్ఛ్రయశ్ఛాయా
సత్పుంసో మరుభూరివ జీవనమాత్రం సమాశాస్యమ్’’ అని పేర్కొన్నారు.
स्वाधीनैव समृद्धिर्जनोपजीव्यत्वमुच्छ्रयश्छाया।
— Narendra Modi (@narendramodi) September 18, 2026
सत्पुंसो मरुभूरिव जीवनमात्रं समाशास्यम्॥ pic.twitter.com/KTlxVofSBs