Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహిళల స్కీట్ టీమ్ విభాగంలో కాంస్యం గెలుచుకున్న పరినాజ్ ధలీవాల్, మహేశ్వరి చౌహాన్, రైజా థిల్లాన్‌లకు ప్రధానమంత్రి అభినందనలు


మహిళల స్కీట్ జట్టు విభాగంలో కాంస్య పతకం సాధించిన పరినాజ్ ధలీవాల్, మహేశ్వరి చౌహాన్, రైజా ధిల్లాన్‌లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అభినందించారు.

విజేతల ఏకాగ్రత, ఖచ్చితత్వం, సమష్టికృషి భారతీయ క్రీడారంగానికి మరో గర్వకారణమైన క్షణాన్ని అందించాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో జరిగే పోటీల్లో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.

‘‘మహిళల స్కీట్ జట్టు విభాగంలో కాంస్య పతకం సాధించిన పరినాజ్ ధలీవాల్, మహేశ్వరి చౌహాన్రైజా ధిల్లాన్‌లకు అభినందనలు.

క్రీడాకారుల ఏకాగ్రత, ఖచ్చితత్వంజట్టుకృషి భారతీయ క్రీడలకు మరొక గర్వకారణమైన క్షణాన్ని తెచ్చిపెట్టాయి. వారు భవిష్యత్తులో చేపట్టే ప్రయత్నాలకు శుభాకాంక్షలు: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’

 

***