Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాష్ట్రకవి రామ్‌ధారీ సింగ్ దినకర్ గారి జయంతి.. నివాళులు అర్పించిన ప్రధానమంత్రి


రాష్ట్రకవి రామ్‌ధారీ సింగ్ దినకర్ గారి జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.

ఆయన శక్తిమంతమైన కవితల్లో ప్రజా చైతన్యంతో పాటు దేశాభిమాన భావోద్వేగాలు నిండి ఉంటాయనీ, అవి నేటికీ ప్రజల మనసులో శౌర్యం, తేజస్సు, ఆత్మగౌరవాన్ని నింపుతున్నాయనీ ప్రధానమంత్రి అన్నారు. ఆయన రచనలు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడం మాత్రమే కాకుండా, మాతృభూమి పట్ల అంకితభావాన్ని కూడా కలిగిస్తున్నాయని ప్రధాని అన్నారు. ఆయన మహనీయ వ్యక్తిత్వం, కాల పరీక్షకు తట్టుకొని నిలిచిన ఆయన రచనలు తరాల తరబడి భారతీయులకు మార్గదర్శనం చేస్తూ ఉంటాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ :

‘‘రాష్ట్రకవి రాంధారీ సింగ్ దినకర్ గారి జయంతి సందర్భంగా ఆయనకు శత సహస్ర నమస్సులు. ప్రజాచైతన్యం, జాతీయ ఆత్మగౌరవ భావాలు ఉట్టిపడే ఆయన శక్తిమంతమైన కవితలు నేటికీ దేశ ప్రజల హృదయంలో శౌర్యాన్నీ, తేజాన్నీ, ఆత్మగౌరవాన్నీ నింపుతున్నాయి. ఆయన రచనలు సాహిత్యాన్ని సంపన్నం చేయడంతో పాటు మాతృభూమి పట్ల అంకితభావాన్ని పెంచుతున్నాయి. ఆయన విరాట్ వ్యక్తిత్వం, కాల పరీక్షకు తట్టుకొని నిలిచే కృతులు యుగ యుగాల వరకూ భారతీయులకు మార్గదర్శకంగా నిలుస్తాయి’’ అని పేర్కొన్నారు.

 

***