పిఎంఇండియా
ఆసియా క్రీడలలో కాంస్య పతకం సాధించిన పురుషుల బ్యాడ్మింటన్ జట్టును ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ పతకం వారి అంకితభావాన్ని, కఠిన శ్రమను తెలియజేస్తోందని ప్రధానమంత్రి అన్నారు. పోటీలో జట్టు అద్భుతమైన బృంద స్ఫూర్తిని ప్రదర్శించిందని ఆయన కొనియాడారు. భవిష్యత్తులో జరగబోయే పోటీలన్నింటిలోనూ వారు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:
“ఆసియా క్రీడలలో కాంస్య పతకం సాధించిన మన పురుషుల బ్యాడ్మింటన్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు.
ఈ పతకం వారి తపన, కఠిన శ్రమను తెలియజేస్తోంది. పోటీల సమయంలో జట్టు మొత్తం గొప్ప బృంద స్ఫూర్తిని కనబరిచింది.
రానున్న క్రీడా పోటీల్లో వారు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా: ప్రధాని”
Congratulations to our Men’s Badminton Team on winning the Bronze Medal at the Asian Games!
— PMO India (@PMOIndia) September 24, 2026
This medal reflects their passion and hard work. The entire team displayed great spirit throughout the competition.
Best wishes to them for the events ahead: PM @narendramodi