Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ వృద్ధికీ, సౌభాగ్యానికీ జోరును అందించడంలో ‘మేక్ ఇన్ ఇండియా’ పోషిస్తున్న పాత్రను ప్రస్తావించిన ప్రధానమంత్రి


‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి 12 సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో ఆ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రస్తావించారు.

భారతదేశం అభివృద్ధికీ, సౌభాగ్యానికీ దోహదం చేసే మౌలిక సదుపాయాలు, వాణిజ్య వ్యవస్థ, నూతన ఆవిష్కరణలను సమకూర్చడం ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యమని ప్రధానమంత్రి అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘‘భారత్ అభివృద్ధి, సౌభాగ్య పథంలో దూసుకుపోవడానికి కావలసిన మౌలిక సదుపాయాలను కల్పించడం, వాణిజ్య వ్యవస్థను తీర్చిదిద్దడంతో పాటు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ‘మేక్ ఇన్ ఇండియా’ ధ్యేయం.

‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం అమల్లోకి వచ్చి పుష్కర కాలమైంది’’ అని పేర్కొన్నారు. ఈ సందేశానికి ఒక వీడియోను కూడా జోడించారు.

 

***