పిఎంఇండియా
ఉత్కంఠభరితమైన ఫైనల్ పోరులో అద్భుతమైన ఆటతో బంగారు పతకం సాధించిన మహిళల కబడ్డీ జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
భారత జట్టు అసాధారణ ధైర్యం, సంయమనం, సమష్టి కృషిని ప్రదర్శించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మన కబడ్డీ విజేతల పట్ల భారత్ గర్విస్తోందని శ్రీ మోదీ అన్నారు. క్రీడాకారిణులు భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
“ఎంత ఉత్కంఠభరితమైన ఫైనల్ పోరు! మహిళల కబడ్డీ జట్టుకు అద్భుతమైన బంగారు పతకం! మన క్రీడాకారిణులకు అభినందనలు. జట్టు అసాధారణ ధైర్యం, సంయమనం, సమష్టి కృషిని ప్రదర్శించింది. మన కబడ్డీ విజేతల పట్ల భారత్ గర్విస్తోంది. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు” అని శ్రీ నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు.
****