Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహాత్మా గాంధీ అనుసరించిన సత్యం, అహింస, కరుణ, సేవ అనే ఆదర్శాలను చాటిన


పూజ్య బాపూ జీవితమంతా సత్యం, అహింస, కరుణ, సేవ అనే ఆదర్శాలకు ఒక దీప స్తంభంగా వెలుగులీనిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. గాంధీ జీ జీవితం, ఆయన ఆదర్శాలు మానవతా మార్గంలో యుగ యుగాల పాటు కాంతులను ప్రసరిస్తూ ఉంటాయని ప్రధానమంత్రి అన్నారు.

‘‘అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ

నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ’’ అనే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.

సృష్టిలో ఏ ప్రాణి పట్ల ద్వేషాన్ని పెంచుకోని వారు, అందరినీ స్నేహభావంతో, దయతో అక్కున చేర్చుకొనే వారు, లాలసను, అహంకారాన్ని వదలిపెట్టిన వారు, సుఖ దుఃఖాలను రెండిటినీ సమభావంతో స్వీకరించే వారు, అందరి పట్ల క్షమను కలిగి ఉండే వారు.. అలాంటి వారే పరమ సాధకులు అవుతారనే సందేశాన్ని మనకు ఈ సుభాషితం అందిస్తోంది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘‘సత్యం, అహింస, కరుణ, సేవల వెలుగును ప్రసరించే ఓ దీప స్తంభంగా పూజ్య బాపూ సంపూర్ణ జీవితం భాసిల్లింది. ఆయన జీవితం.. ప్రతి యుగంలో మానవతా మార్గాన్ని కాంతిమయం చేస్తూనే ఉంటుంది.

అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ

నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ’’ అని పేర్కొన్నారు.