పిఎంఇండియా
మాజీ ప్రధానమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.
లాల్ బహదూర్ శాస్త్రి నిరాడంబరత, దేశం పట్ల ఆయనకున్న అంకితభావం నేటికీ ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. శాస్త్రి గారి సౌమ్య వ్యక్తిత్వం ప్రతి భారతీయుడిలో గర్వభావాన్ని నింపుతుందని, ఆయన సంకల్పం శిలలా దృఢంగా ఉండేదని అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘లాల్ బహదూర్ శాస్త్రి గారికి నివాళులు. ఆయన నిరాడంబరత, దేశం పట్ల అంకితభావం నేటికీ ఎంతో స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.”
Homage to Lal Bahadur Shastri Ji, whose simplicity and dedication to the nation remain deeply inspiring. pic.twitter.com/edMiRdsf0v
— Narendra Modi (@narendramodi) October 2, 2026