Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజస్థాన్‌లోని కోటాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిపట్ల పీఎం సంతాపం పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి పరిహారం ప్రకటన


రాజస్థాన్‌లోని కోటాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిపట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు.

మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి పరిహారం అందిస్తామని ప్రధానమంత్రి ప్రకటించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

రాజస్థాన్‌లోని కోటాలో జరిగిన ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవటం బాధాకరం. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.

మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి పరిహారం అందిస్తాం: పీఎం @narendramodi

 

***