పిఎంఇండియా
2026 ఆసియా క్రీడల-రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ మహిళగా నిలిచిన కుంకుమ్ అనీల్ మోహోద్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
నిర్ణయాత్మక షూట్-ఆఫ్‌లో ఆమె ప్రదర్శించిన సంయమనం అత్యద్భుతమని ప్రధానమంత్రి ప్రశంసించారు.
కుంకుమ్ అనీల్ మోహోద్‌కు సదా విజయం లభించాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు. ఆమె భవిష్యత్తు ప్రయత్నాల కోసం శుభాకాంక్షలు తెలిపారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
“ఎప్పటికీ గుర్తుండిపోయే స్వర్ణ పతకం.
2026 ఆసియా క్రీడల-రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ మహిళగా ఘనత సాధించిన కుంకుమ్ అనీల్ మోహోద్‌కు అభినందనలు. నిర్ణయాత్మక ‘షూట్-ఆఫ్’లో ఆమె ప్రదర్శించిన సంయమనం ఎంతో అద్భుతం. ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నా! ఆమె భవిష్యత్తు ప్రయత్నాల కోసం శుభాకాంక్షలు”.
A Gold that will always be remembered.
— PMO India (@PMOIndia) October 3, 2026
Congratulations to Kumkum Anil Mohod on becoming the first Indian woman to win Recurve Individual Gold at the 2026 Asian Games. Her composure in the decisive shoot-off was particularly outstanding. May she keep aiming higher! Best wishes…