పిఎంఇండియా
పవిత్ర హృదయం, త్యాగ భావన, సాహసం, సుఖ దుఃఖాలను సమంగా స్వీకరించడం, సామర్థ్యం, ప్రేమ, నిజాయతీ.. ఇవి సజ్జనులు, అసాధారణ వ్యక్తిత్వాన్ని కలిగిన వారి గుణగణాలు అని చెబుతున్న ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
‘‘శుచిత్వం త్యాగితా శౌర్యం సామాన్యం సుఖదుఃఖాయో,
దాక్షిణ్యం చానురక్తిశ్చ సత్యతా చ సుహృద్గుణాః’’ అనే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.
పవిత్ర హృదయం, త్యాగ భావన, సాహసం, సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించడం, సామర్థ్యం, ప్రేమ, నిజాయతీ.. ఇవి ఒక సాధారణ నేస్తం గుణాలు మాత్రమే కావనీ, ఇవి సజ్జనులు, అసాధారణ వ్యక్తిత్వం కలిగిన వారి అద్వితీయ గుణాలు కూడాననీ మనకు ఈ సుభాషితం బోధిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ,
‘‘శుచిత్వం త్యాగితా శౌర్యం సామాన్యం సుఖదుఃఖయోః
దాక్షిణ్యం చానురక్తిశ్చ సత్యతా చ సుహృద్గుణాః’’ అని పేర్కొన్నారు.
***
शुचित्वं त्यागिता शौर्यं सामान्यं सुखदुःखयोः। दाक्षिण्यं चानुरक्तिश्च सत्यता च सुहृद्गुणाः॥ https://t.co/vKvqfnXsCm
— Narendra Modi (@narendramodi) October 5, 2026