పిఎంఇండియా
ఆసియా క్రీడలు-2026లో మహిళల టీమ్ గోల్ఫ్ ఈవెంట్లో రజత పతకం సాధించిన అదితి అశోక్, ప్రణవి శరత్ ఉర్స్, దీక్షా దాగర్లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
వారి విజయం ఈ క్రీడ పట్ల వారి సంకల్పాన్ని, అభిరుచినీ తెలియజేస్తోందని ప్రధానమంత్రి అన్నారు.
అదితి అశోక్, ప్రణవి శరత్ ఉర్స్, దీక్షా దాగర్లకు సదా విజయం చేకూరాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు. రాబోయే కాలంలో వారు మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
‘‘నిన్న జరిగిన ఆసియా గేమ్స్-2026 మహిళల టీమ్ గోల్ఫ్ ఈవెంట్లో రజత పతకం గెలుచుకున్న అదితి అశోక్, ప్రణవి శరత్ ఉర్స్, దీక్షా దాగర్లకు అభినందనలు. ఆట పట్ల వారి పట్టుదల, అభిరుచిని ఈ విజయం చాటిచెబుతోంది. రాబోయే కాలంలో వారు మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నా’’.
Kudos to Aditi Ashok, Pranavi Sharath Urs and Diksha Dagar on winning the Silver Medal in the Women’s Team Golf event at the Asian Games 2026 yesterday. This success highlights their determination and passion for the sport. May they continue to attain new heights of success in the times to come: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 4, 2026