Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఒప్పందాల జాబితా: భారత్‌లో స్విట్జర్లాండ్ అధ్యక్షుడి అధికారిక పర్యటన


I. అవగాహన ఒప్పందం/ ఆసక్తి వ్యక్తీకరణ పత్రం / ఒప్పందం

క్ర.సం.

ఆశిస్తున్న ఫలితం

వివరణ

1.

వలసలు, సంచార భాగస్వామ్య (ఎంఎంపీ) అవగాహన ఒప్పందం

సమానత్వ సూత్రాలకు అనుగుణంగా వలసలు, రాకపోకల్లో సహకారాన్ని పెంపొందించడం, అలాగే జాతీయ చట్టాలకు లోబడి అక్రమ వలసలు, మానవ శ్రమ దోపిడీ, అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఈ అవగాహన ఒప్పందం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఒప్పందం ద్వారా.. ప్రతి సందర్శనకు గరిష్టంగా 6 నెలల వరకు బస చేసే సదుపాయంతో.. అయిదేళ్ల వరకు చెల్లుబాటు అయ్యే ‘మల్టిపుల్ ఎంట్రీ వీసాలు’, ఏటా నవీకరించుకునేందుకు వీలుండేలా ఏడాది వ్యవధి గల విద్యార్థి పర్మిట్లను ఈ అవగాహన ఒప్పందం మంజూరు చేస్తుంది.

2.

యువ నిపుణుల విజ్ఞాన వినిమయంపై ఒప్పందం

ఇరు దేశాల యువ నిపుణులు తమ రంగాల్లో తాత్కాలిక ఉపాధిని పొందుతూ వృత్తిపరమైన, భాషా నైపుణ్యాలను పెంపొందించుకునే ప్రక్రియను క్రమబద్ధీకరించాలని ఈ ఒప్పందం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కింద ఒక్కో దేశం నుంచి ఏటా 300 మంది నిపుణుల పరస్పర పర్యటనలకు అవకాశం ఉంటుంది. ఈ సంఖ్యను భవిష్యత్తులో 500 వరకు పెంచవచ్చు. అలాగే జాతీయత/నివాస స్థితిని నిర్ధారించడం కోసం 30/90 రోజుల గడువుతోపాటు మరికొన్ని ఇతర నిబంధనలను కూడా ఇందులో పొందుపరిచారు.

3.

గుర్తించిన రవాణా సాంకేతికతలు, రహదారి వ్యవస్థలు, మౌలిక సదుపాయాల్లో ప్రోత్సాహం, సహకారంపై… ఫెడరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎఫైర్స్, ఎడ్యుకేషన్, రీసెర్చ్ (ఈఏఈఆర్) – రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వశాఖల మధ్య అవగాహన ఒప్పందం

రవాణా, సంచార వ్యవస్థలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ – ఎలక్ట్రిక్ వాహనాలు, రోప్‌వేలు, పునరుత్పాదక ఆర్థిక వ్యవస్థ (సర్క్యులర్ ఎకానమీ), సొరంగాలు, రవాణాపరమైన ఇతర అంశాల్లో సాంకేతికతలను, మౌలిక వసతులను ముందుకు తీసుకెళ్లడం ద్వారా.. సుస్థిర పద్ధతుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని ఈ అవగాహన ఒప్పందం లక్ష్యంగా పెట్టుకుంది.

4.

శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్‌టీ), స్విట్జర్లాండ్ నేషనల్ సైన్స్‌ ఫౌండేషన్‌ (ఎస్‌ఎన్ఎస్ఎఫ్) మధ్య అవగాహనకు సంబంధించిన ఆసక్తి వ్యక్తీకరణ పత్రం (ఎల్ఓఐ)

భారత్‌, స్విట్జర్లాండ్‌ పరిశోధన వర్గాల మధ్య దీర్ఘకాలిక సహకారాన్ని ప్రోత్సహించడమే ఈ ఆసక్తి వ్యక్తీకరణ లేఖ ముఖ్య లక్ష్యం. ఇందులో భాగంగా ప్రారంభ దశలో శాస్త్రీయ పరిశోధనల్లో పరస్పర సహకారాన్ని ప్రోత్సహించడం, భవిష్యత్తులో సంయుక్త పరిశోధనలకు భాగస్వామ్యాలను నిర్మించడం,  పరస్పరం అంగీకరించిన ప్రాధాన్య రంగాల్లో దీర్ఘకాలిక పరిశోధన కార్యక్రమాలను కొనసాగించేందుకు విస్తృత సహకార వ్యవస్థను నెలకొల్పనున్నారు.

5.

శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్‌టీ) – జ్యూరిక్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్సెస్‌ మధ్య… ఆవిష్కరణలు, సాంకేతికత బదిలీ, వాణిజ్యపరమైన అభివృద్ధిలో సహకారం అమలుకు ఏర్పాట్లు

ఈ అమలు ఒప్పందం (ఐఏ) ద్వారా.. ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, వాణిజ్యపరమైన అభివృద్ధి రంగాల్లో భారత్‌, స్విట్జర్లాండ్‌ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని నెలకొల్పడమే లక్ష్యం. ఇందులో భాగంగా ప్రారంభ దశలో ఉన్న అంకుర సంస్థల కోసం భారత్‌–స్విట్జర్లాండ్‌ మధ్య విద్య, పారిశ్రామిక శిక్షణ (ఏఐటీ ఇండియా) కార్యక్రమాన్ని అమలు చేస్తారు. ద్వైపాక్షిక భాగస్వామ్య కార్యక్రమాలు, సంయుక్త వర్క్‌షాప్‌లు, సామర్థ్యాభివృద్ధి, నెట్‌వర్కింగ్‌ ద్వారా ఈ సహకారాన్ని ముందుకు తీసుకెళ్తారు.

 

***