Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రభుత్వాధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ప్రపంచ నాయకుల శుభాకాంక్షలు


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 అక్టోబర్ 7 నాటికి ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల చారిత్రక ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ ఖండాలకు చెందిన ప్రపంచ నాయకులు ఆయనకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా శ్రీ మోదీ బాధ్యతలు చేపట్టారు. 2014లో భారతదేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2001 నుంచి నేటి వరకు పరిపాలనలో పాతికేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పరివర్తనాత్మక నాయకత్వాన్ని, సుపరిపాలన పట్ల అంకితభావాన్ని, ప్రపంచశాంతి, సమ్మిళిత్వం, సుస్థిరాభివృద్ధి పట్ల నిబద్ధతను ప్రపంచ నాయకులు కొనియాడారు.

స్వేచ్ఛాయుత, బహిరంగ ఇండో-పసిఫిక్ (ఎఫ్ఓఐపీ) ప్రాంత సాకారానికి కట్టుబడి ఉన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. జపాన్, భారత్ వ్యూహాత్మక లక్ష్యాలను పంచుకుంటున్న మన భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, శ్రీ నరేంద్ర మోదీతో సన్నిహితంగా పనిచేసేందుకు ఆసక్తితో ఉన్నాను”.

పీఎం మోదీకి అభినందనలు తెలియజేస్తూ, కామన్వెల్త్ ఆఫ్ డొమినికా ప్రధానమంత్రి ఇలా అన్నారు.

 

“ప్రభుత్వాధినేతగా గుజరాత్‌లో ప్రయాణం ప్రారంభించి, భారతదేశ నాయకత్వం వరకు 25 ఏళ్లుగా అవిశ్రాంతంగా ప్రజాసేవలందించిన నా ప్రియతమ మిత్రుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి హృదయపూర్వక శుభాకాంక్షలు.

 

మీరు ఈ కీలక ఘట్టాన్ని చేరుకున్న సందర్భంగా డొమినికా దేశానికి అందించిన స్నేహపూర్వక సహకారానికి, ప్రజలపై చూపిన ప్రేమకు నా కృతజ్ఞతలు. ఇరుదేశాల మధ్య ఉన్న బంధాన్ని అపూర్వంగా భావిస్తున్నాను. రానున్న సంవత్సరాల్లో దీన్ని మరింత బలపరుస్తామని ఆశిస్తున్నా.

 

మీరు సంపూర్ణ ఆరోగ్యంతో, శక్తితో ఉండాలని, భారత ప్రజలకు అందిస్తున్న సేవలకు గానూ నిరంతరం విజయాలు కలగాలని కోరుకుంటూ డొమినికా ప్రభుత్వం, ప్రజల తరపున నా అభినందనలు”.

పీఎం మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ, సెర్బియా మాజీ అధ్యక్షుడు ఇలా అన్నారు.

 

“అత్యున్నత స్థాయిలో 25 ఏళ్ల ప్రజా సేవను విజయవంతంగా పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి అభినందనలు.

 

మొదట గుజరాత్ ముఖ్యమంత్రిగా, తర్వాత భారత ప్రధానమంత్రిగా దేశానికి పావు శతాబ్దం పాటు సేవ చేశామని కొద్దిమంది మాత్రమే చెప్పుకోగలరు.

 

మీకు భారత్ పట్ల, దేశ భవిష్యత్ పట్ల ఉన్న ప్రేమ నాకు తెలుసు. మీరు భారత్ స్థాయిని పెంచిన విధానాన్ని ప్రపంచం చూస్తోంది. భారత ప్రజలకు సేవ చేసేందుకు మీరు ఆరోగ్యంగా, శక్తిమంతంగా ఉండి మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నా.

 

మీలాంటి నాయకుడు ఉండటం భారతదేశ అదృష్టం”