Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రభుత్వ అధినేతగా దేశానికి 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తనకు శుభాకాంక్షలు తెలిపిన భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేకు కృతజ్ఞతలు తెలిపారు. పరస్పర విశ్వాసం, అవగాహనతో కూడిన చిరకాల భాగస్వామ్యంతో భారత్, భూటాన్ దేశాలు బలంగా అనుసంధానమై ఉన్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. వికసిత భారత్, సుసంపన్న భూటాన్ కోసం ఇరు దేశాలు పంచుకుంటున్న ఉమ్మడి దార్శనికతను ముందుకు తీసుకువెళ్ళడానికి సన్నిహిత సహకారాన్ని కొనసాగించేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు.

 

“ప్రధాని టోబ్గే…, మీరు అభిమానంతో పంపిన హృదయపూర్వక సందేశానికి ధన్యవాదాలు. పరస్పర విశ్వాసం, అవగాహనతో కూడిన చిరకాల భాగస్వామ్యంతో భారత్, భూటాన్ దేశాలు బలంగా అనుసంధానమై ఉన్నాయి. వికసిత భారత్, సుసంపన్న భూటాన్ కోసం మన ఉమ్మడి దార్శనికతను ముందుకు తీసుకెళ్లేందుకు సన్నిహిత సహకారాన్ని కొనసాగించేందుకు నేను ఎదురుచూస్తున్నాను” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు.