పిఎంఇండియా
ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ అందించిన ఆప్యాయమైన శుభాకాంక్షలకు, దయతో కూడిన మాటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కృతజ్ఞతలు తెలిపారు.
భారత ప్రజల విశ్వాసం, భాగస్వామ్యం ఈ సేవా ప్రస్థానాన్ని ప్రతి దశలోనూ మరింత బలోపేతం చేశాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పర్యటనల సందర్భంగా ఉపరాష్ట్రపతి వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయని ఆయన తెలిపారు.
‘వికసిత్ భారత్’ ఉమ్మడి లక్ష్యాన్ని సాకారం చేసేందుకు మరింత ఉత్సాహంతో కృషి చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.
‘ఎక్స్’ వేదికగా చేసిన ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“సి.పి. రాధాకృష్ణన్ జీ… ఆప్యాయంగా అందించిన మీ శుభాకాంక్షలు, దయతో కూడిన మీ మాటలకు ధన్యవాదాలు.
భారత ప్రజల విశ్వాసం, భాగస్వామ్యం ఈ సేవా ప్రస్థానాన్ని ప్రతి అడుగులోనూ బలోపేతం చేశాయి.
వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పర్యటనలో మీరు చేసిన వ్యాఖ్యలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి.
మన ‘వికసిత్ భారత్’ ఉమ్మడి లక్ష్యాన్ని సాకారం చేసేందుకు మరింత ఉత్సాహంతో కృషి చేయడానికి నేను కట్టుబడి ఉన్నాను.”