Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రభుత్వాధినేతగా దేశానికి 25 ఏళ్ల పాటు సేవలందించిన సందర్భంలో


తనకు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపిన బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వెవర్‌కు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. భారత్-బెల్జియం సంబంధాల్లో నెలకొన్న సానుకూల పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేస్తూ… ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కలిసి పనిచేయడం పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.

 

‘ఎక్స్’ వేదికగా మోదీ ఇలా పేర్కొన్నారు:

 

ప్రధానమంత్రి బార్ట్ డి వెవర్… మీ ఆత్మీయ శుభాకాంక్షలకు ధన్యవాదాలు.

 

మన సంబంధాల్లో ఉన్న సానుకూల ఊపును మరింత ముందుకు తీసుకెళ్లడానికి, మన ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మీతో కలిసి పనిచేయాలని నేను ఆశిస్తున్నాను.