Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్తరాఖండ్ అభివృద్ధి ప్రస్థానం గురించిన వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదిక ద్వారా పంచుకున్నారు.

 

‘దేవభూమి’తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని, అభివృద్ధి పట్ల ఆయన నిబద్ధతను ఈ వ్యాసం తెలియజేస్తుంది. శ్రీ మోదీ దార్శనికత ఉత్తరాఖండ్ అభివృద్ధి ప్రస్థానాన్ని ఎలా వేగవంతం చేసిందో… ప్రజల జీవితాల్లో ఎటువంటి గణనీయమైన మార్పులను తీసుకువచ్చిందో ఇది వివరిస్తుంది.

 

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

 

“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ‘దేవభూమి’తో ఉన్న ప్రత్యేక అనుబంధం, అభివృద్ధి పట్ల ఆయన నిబద్ధత అందరికీ తెలిసినవే. శ్రీ మోదీ దార్శనికత ఉత్తరాఖండ్ అభివృద్ధి ప్రస్థానాన్ని వేగవంతం చేయడంతో పాటు, సామాన్య ప్రజల జీవితాల్లో గణనీయ మార్పులను తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ ధామి ఈ వ్యాసంలో ఆ అంశాలన్నింటినీ సవివరంగా వివరించారు”.