Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రభుత్వాధినేతగా దేశ సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా


ప్రభుత్వాధినేతగా దేశ సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన గ్రెనడా ప్రధానమంత్రి శ్రీ డికాన్ మిచెల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

 

భారత్-గ్రెనడాల మధ్య స్నేహానికి తాను ఎంతో విలువనిస్తాననీ, ఆ సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

 

“ప్రధానమంత్రి డికాన్ మిచెల్ గారూ… మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు. భారత్-గ్రెనడా మధ్య స్నేహానికి నేను ఎంతో విలువనిస్తాను. మన సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఎదురుచూస్తున్నాను.”