పిఎంఇండియా
ప్రభుత్వాధినేతగా పాతికేళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా తనకు అభినందనలు తెలిపిన ఇథియోపియా ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ప్రధాని శ్రీ అబీ అహ్మద్ అలీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య మైత్రీ బంధాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ఇథియోపియా ప్రధానిగా మరోసారి బాధ్యతలు స్వీకరించిన శ్రీ అబీ అహ్మద్ అలీకి శ్రీ మోదీ ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు అందజేశారు.
గత డిసెంబర్ లో తన ఇథియోపియా పర్యటనతో పాటు, ఇటీవల న్యూఢిల్లీలో ప్రధాని అబీ అహ్మద్ అలీతో జరిగిన ద్వైపాక్షిక భేటీని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. ఇథియోపియాతో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య మైత్రీ బంధాన్ని, బహుపాక్షిక సహకారాన్ని మరింత పటిష్టం చేసే దిశగా కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని పునరుద్ఘాటించారు.
ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీ జీ .. మీ హృదయపూర్వక అభినందనలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. మరో దఫా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మీకు నా శుభాకాంక్షలు. గత డిసెంబర్ లో నా ఇథియోపియా పర్యటనతో పాటు, తరువాత న్యూఢిల్లీలో మన మధ్య జరిగిన ద్వైపాక్షిక భేటీ విశేషాలు నేను మర్చిపోలేను. ఇథియోపియాతో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోంది. ఇరు దేశాల మధ్య మైత్రీ బంధాన్ని, బహుపాక్షిక సహకారాన్ని మరింత పటిష్టం చేసే దిశగా నిరంతరం కలసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు.
Thank you, Prime Minister Abiy Ahmed Ali, for your warm wishes. I also extend my congratulations and best wishes on your assumption of office for another term. I fondly recall my visit to Ethiopia last December and our recent meeting in New Delhi. India greatly values its Strategic Partnership with Ethiopia and I look forward to working closely with you to further deepen our cooperation and friendship. @AbiyAhmedAli
— Narendra Modi (@narendramodi) October 8, 2026