పిఎంఇండియా
ప్రభుత్వ అధిపతిగా దేశానికి 25 ఏళ్ల సేవా కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా జాంబియా దేశ అధ్యక్షుడు శ్రీ హకైండే హిచిలేమా తనకు తెలిపిన శుభాకాంక్షలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
జాంబియాతో ఉన్న స్నేహ సంబంధాలను భారత్ ఎంతో విలువైనవిగా భావిస్తోందని శ్రీ మోదీ అన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
సామాజిక మాద్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘అధ్యక్షుడు హిచిలేమా గారూ, మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు.
జాంబియాతో స్నేహ సంబంధాలను భారత్ ఎంతో విలువైనవిగా భావిస్తోంది. ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’.
****
Thank you, President Hichilema, for your warm wishes. India deeply values its friendship with Zambia and I look forward to further strengthening our close partnership. @HHichilema
— Narendra Modi (@narendramodi) October 8, 2026