పిఎంఇండియా
ఇతరులను గౌరవించడం, వినయపూర్వక ప్రవర్తన సద్గుణాలు అని బోధిస్తున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
ఆ సుభాషితం ఇలా ఉంది:
‘‘వత్సరాజోపి తం ప్రాప్తం ప్రదత్తోపాయనం నృపమ్
ప్రీత్యా సమ్మానయామాస శూరా హి ప్రణతిప్రియాః’’.
పరులను గౌరవ పూర్వకంగా స్వాగతించడం, మన దగ్గరకు వచ్చిన వారిని వినయపూర్వకంగా ఆదరించి, వారితో ఆప్యాయంగా మెలగడం ఉత్తమ సంప్రదాయమని ఈ శ్లోకం స్పష్టం చేస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘వత్సరాజోపి తం ప్రాప్తం ప్రదత్తోపాయనం నృపమ్
ప్రీత్యా సమ్మానయామాస శూరా హి ప్రణతిప్రియాః’’ అని పేర్కొన్నారు.
***
वत्सराजोऽपि तं प्राप्तं प्रदत्तोपायनं नृपम्। प्रीत्या सम्मानयामास शूरा हि प्रणतिप्रियाः॥ https://t.co/v0Qn8misP1
— Narendra Modi (@narendramodi) October 9, 2026