మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందచేస్తారు.
“మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేస్తాం. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం” అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నట్టు ఆయన కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో పోస్టు చేసింది.
Distressed to learn about the loss of lives due to a mishap in Gwalior, Madhya Pradesh. My condolences to the bereaved families. Praying for the speedy recovery of the injured. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each of those who lost their lives. The injured would be given Rs. 50,000: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 18, 2026