కేంద్ర మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
భారతదేశ వ్యవసాయ రంగం రూపురేఖలను చెప్పుకోదగినంతగా మార్చడంలో, రైతుల జీవితాలను మెరుగుపరచడంలో సాంకేతిక విజ్ఞానం, పరిశోధనది కీలక పాత్ర అని శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ ఒక వ్యాసంలో రాశారు. పోషణ భద్రతకు ఉన్న ప్రాధాన్యాన్ని ఆ వ్యాసం ప్రస్తావించింది. మరీముఖ్యంగా అధిక విలువ కలిగిన పంటలను సాగు చేయడం, వాతావరణ అననుకూలతలకు తట్టుకొని నిలిచే పంటలను వేయడం, వనరులను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు రైతులు పండించే పంటలకు మెరుగైన మార్కెట్టు లభించేటట్లు మరింత శ్రద్ధ తీసుకోవాలని కూడా వివరించింది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ:
‘‘భారతదేశంలో వ్యవసాయం రూపురేఖలను మార్చడంలోనూ, రైతుల జీవితాలను మెరుగుపరచడంలోనూ సాంకేతిక విజ్ఞానం, పరిశోధన కీలక పాత్రను పోషిస్తున్నాయని కేంద్ర మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ రాశారు.
పోషణ భద్రతకు ఉన్న ప్రాధాన్యాన్ని ఆయన వివరిస్తూ, అధిక విలువ కలిగిన పంటలను సాగు చేయడం, వాతావరణ అననుకూలతలకు తట్టుకొని నిలిచే పంటలను వేయడం, వనరులను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు రైతులు పండించే పంటలకు మెరుగైన మార్కెట్టు లభించేటట్లు మరింత శ్రద్ధ తీసుకోవాలని ఆయన అంటున్నారు.
ఈ వ్యాసాన్ని కింది లింకులోకి వెళ్లి చదవగలరు’’ అని పేర్కొంది.
https://www.hindustantimes.com/opinion/technology-is-central-to-the-agri-transformation-vision-101792523800011.html
***
Union Minister Shri @ChouhanShivraj writes that technology and research are central to transforming Indian agriculture and improving farmers' lives. He highlights the importance of nutrition security, with greater focus on high-value crops, climate-resilient farming, efficient use of resources and better market access for farmers. Do read! https://t.co/Kau2MOub1j
— PMO India (@PMOIndia) October 21, 2026