ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఓ సంస్కృత సుభాషితాన్ని ఈ రోజు పంచుకున్నారు. ఆ సుభాషితం జీవన పర్యంతం కృతజ్ఞత, నిస్వార్థంగా సేవలను అందించే మనుషుల్లోని గుణాలను గురించి చెబుతూ, వారికీ కొబ్బరి చెట్లకూ పోలిక ఉందని వర్ణిస్తుంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘ప్రథమవయసి పీతం తోయమల్పం స్మరన్తః శిరసి నిహితభారా నారికేలా నరాణామ్
దదతి జలమనల్పాస్వాదమాజీవితాన్తం న హి కృతముపకారం సాధవో విస్మరన్తి’’ అని పేర్కొన్నారు.
పై శ్లోకానికి భావం ఇదీ..
కొబ్బరి చెట్టు తన జీవిత ప్రాథమిక దశలో కొద్ది పరిమాణంలోనే అందిన జలాన్నయినా సరే, గుర్తు పెట్టుకొంటుంది. భారీ ఫలాలను అందిస్తూ కూడా జీవిత పర్యంతం మనుషులకు తీయనైన నీటిని అందిస్తుంది. సజ్జనుల ప్రవర్తన కూడా ఇలాంటి కొబ్బరి చెట్ల మాదిరిగానే ఉంటుంది. త్యాగాలకు సిద్ధపడిన వ్యక్తుల పట్ల ఆరాధన భావంతో తాము అందుకున్న ఉపకారాలను ఎప్పటికీ మరచిపోకుండా గుర్తు పెట్టుకుంటారు. అలాంటి మహనీయులు చేసిన త్యాగం, తపస్సు, అంకితభావం పట్ల అత్యంత కృతజ్ఞతతో వీరు మెలగుతారు. చేసే పనుల్లోనూ సేవాభావాన్ని కనబరుస్తూ ఉపకారానికి సదా కృతజ్ఞతలను తెలియజేస్తారు.
प्रथमवयसि पीतं तोयमल्पं स्मरन्तः शिरसि निहितभारा नारिकेला नराणाम्। ददति जलमनल्पास्वादमाजीवितान्तं न हि कृतमुपकारं साधवो विस्मरन्ति॥ https://t.co/A2CXAC9zrU
— Narendra Modi (@narendramodi) October 21, 2026