ఆసియా పారా గేమ్స్-2026 పురుషుల హై జంప్ టి47 విభాగంలో సరికొత్త గేమ్స్ రికార్డుతో స్వర్ణ పతకం సాధించిన నిషాద్ కుమార్ అద్భుత క్రీడా ప్రతిభను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.
ఇది అతనికి రెండో స్వర్ణం కావడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ దేశంలోని యావత్ ప్రజానీకం అభిమానాన్ని చూరగొన్న అతని బహుముఖ ప్రజ్ఞ, అత్యున్నత స్థానంలో నిలవాలనే తపన నిజంగా అసాధారణని శ్రీ మోదీ కొనియాడారు. భవిష్యత్తులోనూ అతడు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“నిషాద్ క్రీడా ప్రతిభ నిజంగా అసాధారణం! పురుషుల హై జంప్ టీ7లో కొత్త గేమ్స్ రికార్డుతో స్వర్ణం సాధించడం అమందానందకరంగా ఉంది. కుమార్‌కు నా హృదయపూర్వక అభినందనలు. లాంగ్ జంప్‌లో ఇప్పటికే ఒక స్వర్ణం సాధించిన నేపథ్యంలో రెండో స్వర్ణం ద్వారా యావద్దేశ ప్రజల ప్రశంసలకు అందుకుంటున్నాడు. అతని బహుముఖ ప్రజ్ఞ, అగ్రస్థానంలో నిలవాలనే తపన ఎంతైనా ప్రశంసార్హం. అతనికి నా అభినందనలతోపాటు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు వివరించింది.
Exceptional sporting performances by Nishad! Congratulations to the talented Nishad Kumar for winning a Gold in the Men's High Jump T47 with a new Games Record. Having already won Gold in the Long Jump, he finishes with two Gold Medals and the admiration of the entire nation. His versatility and pursuit of excellence are truly remarkable. Congratulations to him and all the best for the upcoming endeavours: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 20, 2026